కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని కచ్ జిల్లాలో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు. హరామి నాలా, సర్ క్రీక్ వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన బోర్డర్ అవుట్ పోస్ట్ జి-7ను ప్రారంభించారు. సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కఠినమైన కంచెలు నిర్మిస్తామని అమిత్ షా ప్రకటించారు. ఆయన పర్యటన పాకిస్తాన్‌లో చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం.
