ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవారి లడ్డూకు భారత ప్రభుత్వం భౌగోళిక సూచిక (GI) గుర్తింపును మంజూరు చేసింది. అలాగే లడ్డూ తయారీ, విక్రయాలకు సంబంధించి టీటీడీకి FSSAI లైసెన్స్ కూడా లభించింది. దీంతో శ్రీవారి లడ్డూ నాణ్యత, ప్రామాణికతకు మరింత బలం చేకూరింది. అత్యాధునిక ఏఐ ఆధారిత యంత్రాలతో ముడి పదార్థాల నాణ్యతను పరిశీలిస్తూ, సంప్రదాయ ‘దిట్టం’ ప్రమాణాల ప్రకారం లడ్డూల తయారీ కొనసాగుతోంది. ఇటీవల లడ్డూ రుచి, నాణ్యత మెరుగుపడటంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
