తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. దేశభక్తి, పోరాటాల గురించి పవన్ వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణకు OG కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. పవన్‌ను ఏపీ డిప్యూటీ సీఎంగా గౌరవిస్తామని, సోదరుడిగా వస్తే బిర్యానీ పెడతామని అన్నారు. అయితే తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
