షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కాక్టెయిల్ 2’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. సినిమాలో రష్మిక, కృతి స్వలింగ సంపర్కుల పాత్రల్లో నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై కృతి సనన్ స్పందించారు.
సెట్లో తాము త్వరగా మంచి స్నేహితులమయ్యామని రష్మిక వెల్లడించగా, దీనిపై స్పందించిన షాహిద్ కపూర్.. “అందుకే మీ ఇద్దరిపై అలాంటి రూమర్లు వచ్చాయా?” అంటూ సరదాగా ప్రశ్నించారు. దీనికి కృతి సనన్ సమాధానమిస్తూ.. “ఇద్దరు పురుషులు స్నేహంగా ఉంటే దాన్ని ‘బ్రోమాన్స్’ అంటారు. కానీ ఇద్దరు మహిళలు దగ్గరగా ఉంటే వారి మధ్య ఇంకేదో ఉందని ఊహిస్తారు. అలాంటి ఆలోచనలు బాధాకరం” అని అన్నారు.
కృతి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
