ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు వద్ద MV గోల్డెన్ లియో కార్గో నౌకపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు భారతీయులు ఉండగా, మరో భారతీయుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అంగీకారయోగ్యం కాదని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ నెలలో ఒడెసా పోర్టుపై జరిగిన రష్యా దాడుల్లో ఇప్పటివరకు 28 మంది మృతి చెందారు.



