ఒడెసా పోర్టుపై రష్యా దాడి.. నలుగురు భారతీయులు మృతి

ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు వద్ద MV గోల్డెన్ లియో కార్గో నౌకపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు భారతీయులు ఉండగా, మరో భారతీయుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అంగీకారయోగ్యం కాదని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ నెలలో ఒడెసా పోర్టుపై జరిగిన రష్యా దాడుల్లో ఇప్పటివరకు 28 మంది మృతి చెందారు.