Monday, September 28, 2026

హాలీవుడ్‌కు ‘మహారాజ’.. విజయ్ సేతుపతి సినిమాకు అరుదైన గౌరవం

📰 Generate e-Paper Clip

తమిళ స్టార్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మహారాజ’ అంతర్జాతీయ స్థాయిలో మరో ఘనతను సొంతం చేసుకుంది. 2024లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ రీమేక్ హక్కుల కోసం తమను సంప్రదించినట్లు నిర్మాత సుధన్ సుందరం వెల్లడించారు.

చైనాలో భారీ వసూళ్లు

నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ‘మహారాజ’ భారత్‌తో పాటు విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందింది. ముఖ్యంగా చైనాలో ఈ సినిమా విశేష స్పందన అందుకుంది. అక్కడ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.91.65 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం.

ఓటీటీ వేదికలపైనా సినిమాకు మంచి స్పందన రావడంతో అంతర్జాతీయంగా మరింత గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలోనే హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ ఏజెన్సీ రీమేక్ హక్కుల కోసం చిత్ర నిర్మాతలను సంప్రదించినట్లు సుధన్ సుందరం తెలిపారు.

ఏ-లిస్ట్ స్టార్‌తో హాలీవుడ్ రీమేక్?

హాలీవుడ్ వెర్షన్‌ను ఓ ఏ-లిస్ట్ స్టార్‌తో తెరకెక్కించేందుకు సదరు ఏజెన్సీ ప్రయత్నాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

కాగా, హీరో పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ మాథ్యూ మెక్

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.