తమిళ స్టార్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మహారాజ’ అంతర్జాతీయ స్థాయిలో మరో ఘనతను సొంతం చేసుకుంది. 2024లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ రీమేక్ హక్కుల కోసం తమను సంప్రదించినట్లు నిర్మాత సుధన్ సుందరం వెల్లడించారు.
చైనాలో భారీ వసూళ్లు
నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ‘మహారాజ’ భారత్‌తో పాటు విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందింది. ముఖ్యంగా చైనాలో ఈ సినిమా విశేష స్పందన అందుకుంది. అక్కడ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.91.65 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం.
ఓటీటీ వేదికలపైనా సినిమాకు మంచి స్పందన రావడంతో అంతర్జాతీయంగా మరింత గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలోనే హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ ఏజెన్సీ రీమేక్ హక్కుల కోసం చిత్ర నిర్మాతలను సంప్రదించినట్లు సుధన్ సుందరం తెలిపారు.
ఏ-లిస్ట్ స్టార్‌తో హాలీవుడ్ రీమేక్?
హాలీవుడ్ వెర్షన్‌ను ఓ ఏ-లిస్ట్ స్టార్‌తో తెరకెక్కించేందుకు సదరు ఏజెన్సీ ప్రయత్నాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
కాగా, హీరో పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ మాథ్యూ మెక్