హాలీవుడ్‌కు ‘మహారాజ’.. విజయ్ సేతుపతి సినిమాకు అరుదైన గౌరవం

తమిళ స్టార్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మహారాజ’ అంతర్జాతీయ స్థాయిలో మరో ఘనతను సొంతం చేసుకుంది. 2024లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ రీమేక్ హక్కుల కోసం తమను సంప్రదించినట్లు నిర్మాత సుధన్ సుందరం వెల్లడించారు. చైనాలో భారీ వసూళ్లు నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ‘మహారాజ’ భారత్‌తో పాటు విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందింది. ముఖ్యంగా చైనాలో ఈ సినిమా విశేష స్పందన అందుకుంది....