Friday, September 4, 2026

పిల్లల ప్రాణాలకు ముప్పు.. డోర్ తెరిచే స్కూల్ వ్యాన్ దూసుకెళ్లిన వీడియో వైరల్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం చిన్నారుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. మైలార్‌దేవ్‌పల్లి–ఆరాంఘర్ రోడ్డుపై TS 08 UB 0679 నంబర్ గల సెయింట్ ఆంథోనీ స్కూల్ వ్యాన్ డోర్ తెరిచి ఉండగానే వేగంగా వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో వ్యాన్ డోర్ తెరిచి ఉన్నప్పటికీ డ్రైవర్ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడం కనిపిస్తోంది. వ్యాన్‌లో చిన్నారులు ప్రయాణిస్తున్న సమయంలో ఇలా వాహనం నడపడం వారి భద్రతపై తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. అనుకోకుండా ఓ చిన్నారి వ్యాన్ నుంచి జారిపడితే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే స్కూల్ ఫీజులు, ఇతర ఛార్జీల పెంపుపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న వేళ.. తమ పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికి సురక్షితంగా చేరుతున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ ఘటనపై రవాణా అధికారులు, సంబంధిత అధికారులు, స్కూల్ యాజమాన్యం వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్కూల్ వాహనాల్లో భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.