Tuesday, September 29, 2026

ఎస్సై వేధిస్తున్నారంటూ కుటుంబం ఆందోళన.. పురుగుల మందు డబ్బాతో నిరసన

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్: తమను ఎస్సై వేధిస్తున్నారంటూ ఓ కుటుంబం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలానికి చెందిన తూర్పు తండా నివాసులు గూగులోత్ రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు బుధవారం దంతాలపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన చేపట్టారు. భూవివాదం విషయంలో తమ వాదన, ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుండా దంతాలపల్లి ఎస్సై బి. రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఎస్సై వేధింపుల కారణంగా తమకు ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి ఎస్సైపై సమగ్ర విచారణ చేపట్టాలని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారుభూవివాదానికి సంబంధించిన అంశంలో తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.