Friday, September 4, 2026

హోటల్ గదిలో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

📰 Generate e-Paper Clip

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను వెంబడించి, హోటల్ గదిలో మరో వ్యక్తితో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. సైట్‌ తనిఖీకి వెళ్తున్నానని భర్తకు చెప్పిన మహిళ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌తో కలిసి లక్నోలోని ఓ హోటల్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే భార్య వ్యవహారంపై అనుమానం కలిగిన భర్త ఆమెను అనుసరించాడు.

హోటల్‌కు చేరుకున్న అనంతరం భార్య, ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌ ఉన్న గదిని గుర్తించిన భర్త.. వారిద్దరినీ అక్కడే పట్టుకున్నాడు. ఈ క్రమంలో హోటల్‌లో చోటుచేసుకున్న పరిణామాలను కొందరు వీడియో తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇందులో పాల్గొన్న వ్యక్తుల వాంగ్మూలాలను పోలీసులు సేకరిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.