బోనాల్లో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా.. ట్రోలింగ్‌పై కంటతడ
హైదరాబాద్: ‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఫరియా అబ్దుల్లా బోనాల వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా సోషల్ మీడియాలో ఎదురైన ట్రోలింగ్‌పై భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన బోనాల కార్యక్రమంలో పాల్గొన్నందుకు కొందరు ముస్లిం నెటిజన్లు తనను తీవ్రంగా విమర్శిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బోనాల్లో పాల్గొన్నందుకు తాను మతానికి మచ్చ తెస్తున్నానంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారని చెబుతూ ఫరియా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి ఇస్లాం మతాన్ని ఇష్టపడి స్వీకరించారని, చిన్నప్పటి నుంచి ఇస్లాంలోని మంచి విషయాలను తనకు పరిచయం చేస్తూ పెంచారని ఆమె తెలిపారు.
తాను ఇస్లాం మతంలో ఎప్పుడూ మంచినే చూశానని పేర్కొన్న ఫరియా.. తనను తప్పు చేస్తున్నానని, ‘కాఫిర్’ అని విమర్శిస్తున్న వారిపైనా తీవ్రంగా స్పందించారు. తనను విమర్శించిన ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పారు.
ఫరియా అబ్దుల్లా భావోద్వేగంతో చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెకు పలువురు నెటిజన్లు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.


