Friday, September 4, 2026

బంగారం ధరలపై సంచలన అంచనా.. తులం రూ.15 లక్షలకు చేరుతుందా?

📰 Generate e-Paper Clip

బంగారం ధరలపై ప్రముఖ పెట్టుబడిదారుడు థామస్ కాప్లాన్ సంచలన అంచనా వేశారు. భవిష్యత్తులో పసిడి ధరలు ఏకంగా పది రెట్లు పెరిగే అవకాశం ఉందని, తులం బంగారం ధర రూ.15 లక్షల వరకు చేరొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థల్లో అనిశ్చితి వంటి పరిణామాలతో బంగారానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని కాప్లాన్ పేర్కొన్నారు. దీంతో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరవచ్చని అంచనా వేశారు.

ఇక ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షణ పొందేందుకు ఇప్పటికే పలు దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కూడా బంగారం ధరల పెరుగుదలకు కీలక కారణంగా మారుతున్నాయని పేర్కొన్నారు.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.