80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువుల ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ, ఆ భారం రైతులపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని తెలిపారు. సుమారు రూ.3,000 విలువైన యూరియా బస్తాను రైతులకు రూ.300కే, రూ.5,000 విలువైన DAP బస్తాను రూ.1,350కే అందిస్తున్నామని పేర్కొన్నారు.
అదే సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు. బాధిత ప్రాంతాలకు అవసరమైన సహాయం అందించేందుకు దేశం మొత్తం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.


