విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు (జి. షణ్ముఖ) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.విశాఖపట్నంలోని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, పండుకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని, అనంతరం రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఆపరేషన్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం కనీసం ఆరు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.
