Tuesday, September 29, 2026

‘పురుషన్’ షూటింగ్‌లో హీరో విశాల్‌కు గాయం.. ఆస్పత్రికి తరలింపు

📰 Generate e-Paper Clip

తమిళ నటుడు విశాల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పురుషన్’ షూటింగ్‌లో గాయపడినట్లు కోలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

గురువారం ఓ ఫైట్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తుండగా విశాల్‌కు గాయాలైనట్లు సమాచారం. వెంటనే చిత్రబృందం ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన నేపథ్యంలో సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం విశాల్‌ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆయనకు అయిన గాయం తీవ్రతపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.

విశాల్‌ ఆరోగ్య పరిస్థితిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.