‘పురుషన్’ షూటింగ్‌లో హీరో విశాల్‌కు గాయం.. ఆస్పత్రికి తరలింపు
తమిళ నటుడు విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘పురుషన్’ షూటింగ్‌లో గాయపడినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. గురువారం ఓ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా విశాల్‌కు గాయాలైనట్లు సమాచారం. వెంటనే చిత్రబృందం ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం విశాల్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆయనకు అయిన గాయం తీవ్రతపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. విశాల్ ఆరోగ్య పరిస్థితిపై చిత్రబృందం...