Monday, September 28, 2026

ఆర్మీ చరిత్రలో తొలిసారి.. శునకంతో కలిసి పారాచూట్ జంప్

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ: భారత సైన్యం అరుదైన విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించింది. తొలిసారిగా ఓ సుశిక్షిత ఆర్మీ శునకంతో కలిసి పారాచూట్ జంపింగ్ నిర్వహించింది. సెంట్రల్ ఇండియాలోని బేహట్ డ్రాప్ జోన్‌లో ఈ విన్యాసం చేపట్టినట్లు సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.ఓ ఆర్మీ పారాట్రూపర్, డాగ్ హ్యాండ్లర్‌తో కలిసి పూర్తి కంబాట్ లోడ్‌తో విమానం నుంచి పారాచూట్ ద్వారా విజయవంతంగా కిందకు దిగారు. ఈ సందర్భంగా సైనికుడు, శునకం మధ్య ఉన్న సమన్వయం, నమ్మకం, అసాధారణ అనుబంధం స్పష్టంగా కనిపించిందని సెంట్రల్ కమాండ్ పేర్కొంది.

ఎయిర్‌బోర్న్ ఆపరేషన్లలో శునకాల వినియోగం

ప్రత్యేక శిక్షణ పొందిన శునకాలను వివిధ సైనిక ఆపరేషన్లలో వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ఎయిర్‌బోర్న్ మిషన్లలోనూ వీటి సేవలను ఉపయోగిస్తున్నట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది.అమెరికా నేవీ సీల్స్ కూడా ప్రత్యేక ఆపరేషన్లలో ఇలాంటి సుశిక్షిత శునకాలను వినియోగించినట్లు పేర్కొంది. ఒసామా బిన్ లాడెన్‌పై నిర్వహించిన ఆపరేషన్‌లోనూ శునకాన్ని ఉపయోగించిన విషయాన్ని ప్రస్తావించింది.

భారత సైన్యం నిర్వహించిన ఈ విన్యాసం.. భవిష్యత్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన శునకాలను ఎయిర్‌బోర్న్ మిషన్లలో వినియోగించే సామర్థ్యాన్ని చాటిచెప్పింది.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.