ఆర్మీ చరిత్రలో తొలిసారి.. శునకంతో కలిసి పారాచూట్ జంప్
న్యూఢిల్లీ: భారత సైన్యం అరుదైన విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించింది. తొలిసారిగా ఓ సుశిక్షిత ఆర్మీ శునకంతో కలిసి పారాచూట్ జంపింగ్ నిర్వహించింది. సెంట్రల్ ఇండియాలోని బేహట్ డ్రాప్ జోన్‌లో ఈ విన్యాసం చేపట్టినట్లు సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.ఓ ఆర్మీ పారాట్రూపర్, డాగ్ హ్యాండ్లర్‌తో కలిసి పూర్తి కంబాట్ లోడ్‌తో విమానం నుంచి పారాచూట్ ద్వారా విజయవంతంగా కిందకు దిగారు. ఈ సందర్భంగా సైనికుడు, శునకం మధ్య ఉన్న సమన్వయం, నమ్మకం, అసాధారణ అనుబంధం స్పష్టంగా కనిపించిందని సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఎయిర్‌బోర్న్ ఆపరేషన్లలో శునకాల...