Friday, September 4, 2026

Medchal:ఇంద్రానగర్‌లో రోడ్డు వెడల్పు పనులు.. అధికారులతో కాలనీవాసుల వాగ్వాదం

📰 Generate e-Paper Clip

ఇంద్రానగర్‌లో రోడ్డు వెడల్పు పనులు.. అధికారులతో కాలనీవాసుల వాగ్వాదం

 

మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో గురువారం ఉదయం చేపట్టిన రోడ్డు వెడల్పు పనులు ఉద్రిక్తతకు దారితీశాయి. రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు, కాంట్రాక్టర్ ఒకవైపు మాత్రమే రోడ్డు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

రోడ్డు వెడల్పు చేయాల్సి వస్తే ఇరువైపులా సమానంగా స్థలం తీసుకోవాల్సి ఉండగా, ఒకవైపునే పనులు చేపట్టడం సరికాదని స్థానికులు అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌కు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు.

 

స్థానికుల అభ్యంతరాలతో కొద్దిసేపు పనులు నిలిచిపోయి అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డు విస్తరణ పనులను నిబంధనల ప్రకారం, ఇరువైపులా సమానంగా చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.