Friday, September 4, 2026

మేడ్చల్‌లో జాతీయ రహదారిపై కారు బోల్తా.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌.

📰 Generate e-Paper Clip

మేడ్చల్‌: పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జాతీయ రహదారిపై కారు బోల్తాపడటంతో కొంతసేపు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఒక్కసారిగా రోడ్డుపై కారు బోల్తాపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాద సమయంలో కారులో ఒక్కరే ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

కారు ఏ విధంగా బోల్తాపడిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.