Friday, September 4, 2026

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ఆకస్మిక తనిఖీ.

📰 Generate e-Paper Clip

మచ్చబొల్లారం యూపీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ

 

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ మచ్చబొల్లారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ (యూపీహెచ్‌సీ)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

 

యూపీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్ అందుబాటులో లేకపోవడంపై డీఎంహెచ్‌ఓ ఆరా తీశారు. మెడికల్ ఆఫీసర్ విధులకు ఎందుకు హాజరు కాలేకపోతున్నారు, అందుకు గల కారణాలు ఏమిటనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 

అలాగే ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.