ఎస్సై వేధిస్తున్నారంటూ కుటుంబం ఆందోళన.. పురుగుల మందు డబ్బాతో నిరసన
మహబూబాబాద్: తమను ఎస్సై వేధిస్తున్నారంటూ ఓ కుటుంబం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలానికి చెందిన తూర్పు తండా నివాసులు గూగులోత్ రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు బుధవారం దంతాలపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన చేపట్టారు. భూవివాదం విషయంలో తమ వాదన, ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుండా దంతాలపల్లి ఎస్సై బి. రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఎస్సై వేధింపుల కారణంగా తమకు ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు...