Sunday, September 6, 2026

Bigg Boss 10 Telugu Live: గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 10.. ఒక్కొక్కరుగా హౌస్‌లోకి కంటెస్టెంట్లు

📰 Generate e-Paper Clip

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ‘దశావతారం’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన గ్రాండ్ ప్రీమియర్‌లో హోస్ట్ కింగ్ నాగార్జున తనదైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు.

మూడు భాషల హోస్టులతో నాగార్జున సందడి

బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్ ప్రీమియర్‌లో ప్రత్యేకమైన సన్నివేశం చోటుచేసుకుంది. మలయాళ బిగ్ బాస్ హోస్ట్ మోహన్‌లాల్, కన్నడ బిగ్ బాస్ హోస్ట్ సుదీప్, తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతితో నాగార్జున వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా నాలుగు భాషల బిగ్ బాస్ షోలకు హోస్టులు ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు.

బిగ్ బాస్‌తో మాట్లాడిన నాగార్జున

సీజన్ 10 గ్రాండ్ ప్రీమియర్‌లో నాగార్జున బిగ్ బాస్‌తో సంభాషించారు. ఈసారి ‘టెన్ ఆన్ టెన్’ ఉండబోతోందని బిగ్ బాస్‌కు నాగార్జున తెలిపారు. దీంతో ఈ సీజన్‌లో మరిన్ని కొత్త ట్విస్టులు, ఆసక్తికరమైన పరిణామాలు ఉండబోతున్నాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

నేచర్ థీమ్‌తో బిగ్ బాస్ హౌస్

ఈసారి బిగ్ బాస్ హౌస్‌ను ప్రత్యేకంగా ప్రకృతి (Nature) థీమ్‌తో డిజైన్ చేశారు. హౌస్‌లో ప్రత్యేకంగా ఓ రోబో కూడా కనిపించింది. దానితో నాగార్జున కాసేపు సరదాగా మాట్లాడారు. అనంతరం హౌస్‌లోని వివిధ ప్రాంతాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

హౌస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన నాగ్

సీజన్ 10 మరింత కొత్తగా, ఆసక్తికరంగా ఉండబోతోందని నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా చేతిలో ఓ ప్రత్యేకమైన కీతో కనిపించిన నాగ్.. ఈ కీతో హౌస్‌లోకి వెళ్లే వారి తలరాతలు మారనున్నాయని ఆసక్తికరంగా చెప్పారు.

గొడ్డలితో మాస్ ఎంట్రీ

సీజన్ 10 ప్రారంభోత్సవంలో నాగార్జున తనదైన మాస్ స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. చేతిలో గొడ్డలి పట్టుకుని పవర్‌ఫుల్ లుక్‌లో స్టేజ్‌పైకి వచ్చిన నాగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో గ్రాండ్ ప్రీమియర్ మరింత ఉత్సాహంగా ప్రారంభమైంది.

ఒకే రోజు నాలుగు భాషల్లో బిగ్ బాస్

బిగ్ బాస్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచే విధంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కొత్త సీజన్లు ఒకే రోజున ప్రారంభమవుతున్నాయి.

తెలుగులో నాగార్జున, కన్నడలో సుదీప్, మలయాళంలో మోహన్‌లాల్, తమిళంలో విజయ్ సేతుపతి తమ తమ బిగ్ బాస్ సీజన్లకు హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు.

ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 10లోకి ఒక్కొక్కరుగా హౌస్‌మేట్స్ ఎంట్రీ ఇస్తుండటంతో.. ఎవరెవరు హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు? వారి గేమ్ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు సంబంధించిన తాజా ఎంట్రీలు, కంటెస్టెంట్ల వివరాలు, టాస్కులు, ఎలిమినేషన్స్‌ తదితర అప్‌డేట్స్ కోసం ఈ లైవ్ బ్లాగ్‌ను ఫాలో అవ్వండి.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.