Friday, September 4, 2026

మేడ్చల్: 5వ రోజుకు చేరిన మయోర ఉద్యోగుల సమ్మె.

📰 Generate e-Paper Clip

మేడ్చల్: 5వ రోజుకు చేరిన మయోర ఉద్యోగుల సమ్మె

మేడ్చల్: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని మయోర ఇండియా కంపెనీ ఎదుట ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారంతో 5వ రోజుకు చేరింది. ఉద్యోగుల సమ్మెకు మాజీ మంత్రి, మయోరా ఇండియా BRTU యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వారిపై కక్షసాధింపు చర్యలు, వేధింపులను నిలిపివేయాలని కోరారు.

అలాగే డిస్మిస్ చేసిన వైస్ ప్రెసిడెంట్ కె. బాలమల్లేష్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కోత విధించిన ఇన్సెంటివ్స్‌ను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.