మేడ్చల్: 5వ రోజుకు చేరిన మయోర ఉద్యోగుల సమ్మె.
మేడ్చల్: 5వ రోజుకు చేరిన మయోర ఉద్యోగుల సమ్మె మేడ్చల్: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని మయోర ఇండియా కంపెనీ ఎదుట ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారంతో 5వ రోజుకు చేరింది. ఉద్యోగుల సమ్మెకు మాజీ మంత్రి, మయోరా ఇండియా BRTU యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వారిపై కక్షసాధింపు చర్యలు, వేధింపులను నిలిపివేయాలని కోరారు....