యూట్యూబ్ వీడియోల వ్యూస్ లెక్కించే విధానంలో కీలక మార్పు రానున్నట్లు సమాచారం. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు వీడియోను నిర్దిష్ట సమయం వీక్షించిన తర్వాతే దాన్ని ఒక వ్యూగా పరిగణించే విధానం ఉంది. అయితే కొత్త విధానంలో వీడియో ప్లే అయిన వెంటనే.. అంటే మొదటి ఫ్రేమ్ నుంచే వ్యూను లెక్కించే విధంగా మార్పులు చేయనున్నట్లు సమాచారం.
ఈ మార్పు అమల్లోకి వస్తే వీడియోలకు నమోదయ్యే వ్యూస్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా షార్ట్స్, వేగంగా స్క్రోల్ అయ్యే కంటెంట్, తక్కువ నిడివి ఉన్న వీడియోల వ్యూ కౌంటింగ్‌పై దీని ప్రభావం ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
అయితే వ్యూస్ పెరగడం మాత్రమే కాకుండా.. వాచ్‌టైమ్, ప్రేక్షకుల ఎంగేజ్‌మెంట్, వీడియోను ఎంతసేపు చూస్తున్నారు వంటి ఇతర మెట్రిక్స్ కూడా యూట్యూబ్ అల్గారిథమ్‌లో కీలకంగానే కొనసాగనున్నాయి.


