ఆగస్టు 24 నుంచి యూట్యూబ్‌లో వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు
యూట్యూబ్ వీడియోల వ్యూస్ లెక్కించే విధానంలో కీలక మార్పు రానున్నట్లు సమాచారం. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వీడియోను నిర్దిష్ట సమయం వీక్షించిన తర్వాతే దాన్ని ఒక వ్యూగా పరిగణించే విధానం ఉంది. అయితే కొత్త విధానంలో వీడియో ప్లే అయిన వెంటనే.. అంటే మొదటి ఫ్రేమ్ నుంచే వ్యూను లెక్కించే విధంగా మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఈ మార్పు అమల్లోకి వస్తే వీడియోలకు నమోదయ్యే వ్యూస్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా షార్ట్స్, వేగంగా...