Saturday, September 5, 2026

ఈ నెల 24 నుంచి ఆటో, క్యాబ్‌లు బంద్!

📰 Generate e-Paper Clip

తెలంగాణలో ఆగస్టు 24 నుంచి ఆటో, క్యాబ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆటో, క్యాబ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక బంద్ చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల ఐకాస ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 17 కార్మిక సంఘాలకు చెందిన నేతలు పాల్గొని బంద్‌కు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి హామీలను అమలు చేయకపోతే బంద్‌ను కొనసాగిస్తామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. దీంతో ఆగస్టు 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.