ఈ నెల 24 నుంచి ఆటో, క్యాబ్‌లు బంద్!

తెలంగాణలో ఆగస్టు 24 నుంచి ఆటో, క్యాబ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆటో, క్యాబ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక బంద్ చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల ఐకాస ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 17 కార్మిక సంఘాలకు చెందిన నేతలు పాల్గొని బంద్‌కు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా...