గుజరాత్‌లోని వడోదర నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అజ్వా రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు రోడ్డు దాటుతున్న వృద్ధ మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా, వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్న అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
