Friday, September 4, 2026

మేడ్చల్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

📰 Generate e-Paper Clip

మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని పురాతన ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏడాది ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా రాబోయే గణేష్ చతుర్థి వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.