Sunday, September 6, 2026

బండ్ల గణేష్‌ కుమార్తెతో ఎనర్జిటిక్ డ్యాన్స్.. వైరల్‌గా సంగీత్ వీడియో

📰 Generate e-Paper Clip

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన కుమార్తె జనని సంగీత్ వేడుకలో సందడి చేశారు. కుమార్తెతో కలిసి వేదికపై ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేస్తూ అతిథులను అలరించారు. తండ్రి, కుమార్తె కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ముందస్తు వివాహ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సంగీత్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కాగా, సంగీత్ వేడుకలో కుమార్తెతో కలిసి బండ్ల గణేష్ చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియోను అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.