Tuesday, September 29, 2026

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు.. మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

📰 Generate e-Paper Clip

భారత్ ఆతిథ్యం ఇస్తున్న 18వ అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. సదస్సుకు పలు దేశాల ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.సదస్సు నేపథ్యంలో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఢిల్లీలో కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. 35కు పైగా ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు పరిమితులు విధించడంతో పాటు పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అయితే ఢిల్లీ మెట్రో సేవలు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి. ప్రజలు అత్యవసర ప్రయాణాలు ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.