ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లు టెస్ట్ క్రికెట్‌పై దృష్టి సారించారు. జూన్ 6 నుంచి ప్రారంభం కానున్న మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్పిన్నర్ల బౌలింగ్‌ను ఎదుర్కొంటూ సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేయగా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా రెడ్ బాల్‌తో తన బ్యాటింగ్‌కు పదును పెట్టాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్ల కదలికలను నిశితంగా పరిశీలిస్తూ కీలక సూచనలు చేసినట్లు వీడియోలో కనిపించింది.
