సొంత ప్రభుత్వంపైనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్.. నిధులు ఇవ్వకుంటే కురుక్షేత్రమే!
మునుగోడు: కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాల అభివృద్ధి, నిధుల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి, మంత్రులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. మునుగోడు సమస్యలను పరిష్కరించి, రావాల్సిన నిధులు కేటాయించకపోతే భవిష్యత్తులో ప్రభుత్వంతో కురుక్షేత్ర పోరాటం తప్పదని హెచ్చరించారు. బుధవారం మునుగోడులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకే అధిక నిధులు కేటాయించారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్...