ఎల్లంపేట్‌లో కల్వర్టు నిర్మాణానికి రూ.70 లక్షలు.. ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతి

ఎల్లంపేట్: మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ 15వ వార్డు పరిధిలోని డబిల్‌పూర్‌–లింగాపూర్‌ రహదారిపై కల్వర్టు నిర్మాణానికి రూ.70 లక్షలు మంజూరు చేయాలని కోరుతూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతిపత్రం సమర్పించారు. 15వ వార్డు కౌన్సిలర్‌ వేణుగోపాల్‌ గౌడ్‌ నేతృత్వంలో నాయకులు ఎంపీని కలిసి సమస్యను వివరించారు. ఐదు గ్రామాలకు కీలకమైన రహదారి డబిల్‌పూర్‌ నుంచి లింగాపూర్‌ వరకు ఉన్న రహదారి శ్రీరంగవరం, బండమాచారం, లింగాపూర్‌, డబిల్‌పూర్‌, బర్మాజిగూడ ప్రాంతాలకు ముఖ్యమైన రాకపోకల మార్గంగా ఉందని కౌన్సిలర్‌ వేణుగోపాల్‌ గౌడ్‌ తెలిపారు. ఈ ఐదు...