ఫస్ట్ ఎయిడ్ ముసుగులో వైద్యం.. మేడ్చల్‌లో నకిలీ వైద్యంపై ఆరోపణలు
మేడ్చల్, సెప్టెంబర్ 22: ఫస్ట్ ఎయిడ్ పేరుతో మెడికల్ షాపుల పరిధిలోనే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారనే ఆరోపణలు మేడ్చల్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారాయి. వైద్యుడి పర్యవేక్షణ లేకుండా రోగులకు చికిత్స చేయడం, ఇంజక్షన్లు ఇవ్వడం, సెలైన్ ఎక్కించడం, వివిధ రకాల మందులు అందించడం వంటి చర్యలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ పరిధిలోని ఓ మెడికల్ షాప్‌లో సాధారణంగా మందులు విక్రయించాల్సిన...