మేడ్చల్ జాతీయ రహదారిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా రేకబావుల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
అడ్డుగా వచ్చిన మరో కారును ఎంపీ వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ధర్మపురి అరవింద్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఆయన అనుచరులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
ప్రమాదం అనంతరం ఎంపీ స్వయంగా వాహనం నుంచి బయటకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అక్కడి పరిస్థితిని సర్దిచెప్పినట్లు సమాచారం. ఘటనతో కొద్దిసేపు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.