PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 5:42 am Posted by : News Desk

యూపీఐపై ఛార్జీలు.. బ్యాంకులకు రూ.27 వేల కోట్ల ఆదాయం?

యూపీఐ ట్రాన్సాక్షన్లపై వచ్చే నెల 15 నుంచి మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (ఎండీఆర్‌) వసూలు చేయనున్న నేపథ్యంలో బ్యాంకులకు భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని బెర్న్‌స్టీన్ అంచనా వేసింది.

2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి యూపీఐ ఎండీఆర్‌ ద్వారా ఏటా రూ.27 వేల కోట్లు (2.8 బిలియన్ డాలర్లు) అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని తెలిపింది.

ఈ మొత్తంలో దాదాపు 60 శాతం బ్యాంకులకు దక్కనుండగా.. అత్యధిక సేవింగ్స్ ఖాతాలు ఉన్న ఎస్‌బీఐకి సుమారు 25 శాతం ఆదాయం లభించే అవకాశం ఉందని బెర్న్‌స్టీన్ పేర్కొంది.

యూపీఐ వినియోగదారులపై ఈ మార్పు ఎలా ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.