హరీశ్‌రావుపై పొంగులేటి ఫైర్.. ‘అప్పుడు నీ బుద్ధి ఎక్కడికి పోయింది?’
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అది తప్పేనని పేర్కొన్న ఆయన.. అలాంటప్పుడు తన మామ భూముల విషయంలో రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని హరీశ్‌రావును ప్రశ్నించారు. ‘‘అప్పుడు నీ బుద్ధి ఎక్కడికి పోయింది?’’ అంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన పొంగులేటి.. తన మామ భూములకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్‌ఓసీ ఇచ్చిందన్న హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించారు. అసైన్డ్...