పాక్ నేవీ నౌక ఢీకొట్టిందా? భారత్ తీవ్ర నిరసన.. పాక్ రాయబారికి సమన్లు
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన నౌకను పాకిస్థాన్ నేవీ నౌక ఢీకొన్న ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి పాకిస్థాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ సాద్ అహ్మద్ వారైచ్‌ను బుధవారం భారత విదేశాంగ శాఖ పిలిపించి నిరసన తెలిపింది. పాకిస్థాన్ నౌకాదళ యూనిట్ వ్యవహరించిన తీరు “ఆమోదయోగ్యం కానిది, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధం” అని భారత్ స్పష్టం చేసింది. ఉత్తర అరేబియా సముద్రంలో ఘటన సెప్టెంబరు 15 సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ఈ...