మేడ్చల్: చదువుకోవాల్సిన చేతులతో నీళ్లు తరలింపు

నీళ్ల కోసం విద్యార్థుల కష్టం.. చదువును పక్కన పెట్టి నీటి కోసం శ్రమ! మేడ్చల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘటన.. ఉపాధ్యాయుల తీరుపై స్థానికుల ఆగ్రహం మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని గాంధీ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. చదువుకోవాల్సిన చిన్నారులు నీటి కోసం శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు అవసరమైన నీటిని సమీపంలోని ట్యాంక్ నుంచి పైపు సాయంతో తరలించేందుకు విద్యార్థులను ఉపయోగిస్తున్న దృశ్యాలు...