22ఏ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు
హైదరాబాద్: 22ఏ అంశంపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తమ బాధ్యతలను ఎవరో గుర్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది ప్రజల ప్రభుత్వం అని, అసెంబ్లీ సమావేశాలకు ముందే 22ఏ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. శాసనసభలో ఇవాళ మాట్లాడిన సీఎం.. తమ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే 22ఏ అంశంపై చర్చ చేపట్టామని చెప్పారు. అయితే ప్రధాన సమస్యలపై చర్చ జరగకుండా తప్పించుకునేందుకు విపక్షం ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. బాధ్యతారాహిత్యంతోనే సస్పెన్షన్: సీఎం...