PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 8:20 am Posted by : News Desk

22ఏ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు

హైదరాబాద్: 22ఏ అంశంపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తమ బాధ్యతలను ఎవరో గుర్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది ప్రజల ప్రభుత్వం అని, అసెంబ్లీ సమావేశాలకు ముందే 22ఏ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.

శాసనసభలో ఇవాళ మాట్లాడిన సీఎం.. తమ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే 22ఏ అంశంపై చర్చ చేపట్టామని చెప్పారు. అయితే ప్రధాన సమస్యలపై చర్చ జరగకుండా తప్పించుకునేందుకు విపక్షం ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.

బాధ్యతారాహిత్యంతోనే సస్పెన్షన్: సీఎం

బీఆర్ఎస్ సభ్యులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతోనే వారిని సభ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. సభా నిర్వహణకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా పాటిస్తోందని చెప్పారు.

అసెంబ్లీకి నినాదాలతో కూడిన దుస్తులు, ప్లకార్డులు తీసుకురావద్దనే నిబంధనలు గత ప్రభుత్వ హయాంలోనే ఉన్నాయని సీఎం గుర్తు చేశారు. స్పీకర్ ఆదేశాల మేరకే గేట్ నంబర్ 3 వద్ద అధికారులు బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నారని తెలిపారు. పార్లమెంట్‌లోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు.

క్షుద్రపూజల అంశంపైనా సీఎం వ్యాఖ్యలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందని, క్షుద్రపూజల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ సభ్యులకు ముందే తెలుసని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే సభలో ఉండకుండా ఉండేందుకు వారు ఆందోళనకు దిగారని ఆరోపించారు.

గత ప్రభుత్వ తప్పిదాలపై చర్చ జరగకూడదన్నదే బీఆర్ఎస్ విధానంగా కనిపిస్తో