తిరుమల ఆలయ నిర్వహణకు సీఎం చంద్రబాబు ప్రశంసలు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
తిరుమల: తిరుమలలోని క్రమశిక్షణతో కూడిన, పారదర్శకమైన ఆలయ నిర్వహణ దేశంలోని ఇతర దేవాలయాలకు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న చంద్రబాబు.. ముందుగా బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పట్టువస్త్రాలను శిరస్సుపై ఉంచుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ పండితులు...