జీవో 97 రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్‌వీ ఆందోళన.. గెల్లు శ్రీనివాస్ అరెస్ట్

జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్‌వీ) నాయకులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీఆర్‌ఎస్‌వీ నాయకులను పోలీసులు ఎల్బీ స్టేడియం వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ను కూడా...