అసెంబ్లీలో హైడ్రామా.. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్‌

  తెలంగాణ అసెంబ్లీలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్‌ సభ్యులు ఆందోళనకు దిగడంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు కేటీఆర్‌, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్‌ సభ్యులపై స్పీకర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. నిన్న ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద జరిగిన ‘చావుడప్పు’ నిరసనల అంశాన్ని బీఆర్ఎస్‌ సభ్యులు సభలో లేవనెత్తారు. ఈ అంశంపై ఆందోళన చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్‌ సభ్యులు దాదాపు గంటసేపుగా...