PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 5:48 am Posted by : News Desk

బీఆర్ఎస్‌ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు.. సెషన్‌ ముగిసే వరకు సస్పెన్షన్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్‌, ప్రభుత్వానికి మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు.

మహిళా ఎమ్మెల్యేల ఘటనపై బీఆర్ఎస్‌ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానంపై వెంటనే చర్చ చేపట్టాలని వారు పట్టుబట్టారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో 17 మంది బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల సెషన్‌ ముగిసే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని తీర్మానం చేశారు.

మరోవైపు, మిగిలిన బీఆర్ఎస్ సభ్యులు సభలోనే తమ నిరసనను కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.